HomeTelugu Trending'కెప్టెన్‌ మిల్లర్‌' మూవీ ప్రారంభం

‘కెప్టెన్‌ మిల్లర్‌’ మూవీ ప్రారంభం

CAPTAINMILLERmovie 2
కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్ నటిస్తున్న పీరియాడికల్ మూవీ `కెప్టెన్ మిల్లర్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. అరుణ్ మాథేశ్వరన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. 1930 – 1940 మధ్య కాలంలో జరిగిన పలు యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

CAPTAINMILLERmovie launched
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్ పై టి.జి. త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్ అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. మరో పాత్రలో నివేదితా సతీష్ కనిపించబోతోంది. గురువారం ఈ మూవీని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి హీరోలు ధనుష్ సందీప్ కిషన్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ నివేదితా సతీష్ చిత్ర బృందం హాజరయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!