HomeTelugu Trendingబోయపాటి, బాలయ్య సినిమాలో కేథరిన్‌

బోయపాటి, బాలయ్య సినిమాలో కేథరిన్‌

 

6 21
నందమూరి బాలయ్య.. బోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. సింహా, లెజెండ్ సినిమాలు రెండు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో మూడో సినిమాకు ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి 3 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక ఇదిలా ఉంటె, బోయపాటి… బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అనే దానిపై నిన్నటి వరకు అనేక ఊహాగానాలు వచ్చాయి. కాగా, ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ బోయపాటి కేథరిన్ త్రెసాను తీసుకున్నారు. గతంలో బోయపాటి… అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమాలో కేథరిన్ ఎమ్మెల్యే పాత్రలో అదరగొట్టింది. అప్పటి నుంచి కెథరిన్ త్రెసాను మరో సినిమాలో తీసుకోవాలని అనుకున్నాడు. కాగా, ఇప్పుడు బాలయ్య సినిమాలో ఆమెను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేథరిన్ త్రెసా యాక్టింగ్ తో పాటు గ్లామర్ షోకు కూడా ఏ మాత్రం వెనకడుగు వేయదు. అందుకే ఆమెను తీసుకున్నారని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu