CBN vs Revanth Reddy:
భారతదేశంలోని 31 మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల ఆస్తులు, విద్య, వయసు, క్రిమినల్ కేసులపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) సంస్థలు తాజా నివేదిక విడుదల చేశాయి. ఈ నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.931 కోట్లు. మరోవైపు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అత్యల్ప ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆమె ఆస్తుల విలువ కేవలం రూ.15 లక్షలు.
31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ.1630 కోట్లు కాగా, ఒక్కొక్క ముఖ్యమంత్రికి సగటు ఆస్తుల విలువ రూ.52.59 కోట్లు. చంద్రబాబు నాయుడి తర్వాత రూ.332 కోట్ల ఆస్తులతో అరుణాచలప్రదేశ్ సీఎం పేమా ఖాండు, రూ.51 కోట్ల ఆస్తులతో కర్నాటక సీఎం సిద్దరామయ్య నిలిచారు.
ఖాండు వద్ద రూ.180 కోట్ల అప్పులు ఉండగా, సిద్దరామయ్య వద్ద రూ.23 కోట్ల బకాయిలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు బకాయిలు రూ.10 కోట్లు.
మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 89 కేసులతో ప్రధానంగా నిలిచారు. ఇందులో 72 కేసులు Attempt to Murder, Kidnapping వంటి సీరియస్ IPC కేసులుగా గుర్తించారు. తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ పై 47 కేసులు ఉండగా, చంద్రబాబు నాయుడిపై 19 కేసులు ఉన్నాయి.
మహిళా ముఖ్యమంత్రులు కేవలం ఇద్దరే – పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అతిషి. 31 మంది ముఖ్యమంత్రుల్లో 10 మంది గ్రాడ్యుయేట్లు, 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు. ఒకరు 10వ తరగతి వరకు చదివారు. ముగ్గురు 12వ తరగతి పూర్తి చేశారు.
12 మంది ముఖ్యమంత్రులు 51-60 ఏళ్ల వయసు గలవారు కాగా 41-50 ఏళ్ల మధ్య 7 మంది ఉండగా, 71-80 ఏళ్ల వయసు గల 6 మంది ఉన్నారు. 31-40 ఏళ్ల మధ్య ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే ఉన్నారు. నివేదిక ప్రకారం, ముఖ్యమంత్రుల సగటు స్వీయ ఆదాయం రూ.13,64,310, ఇది భారత సగటు వ్యక్తిగత ఆదాయానికి (రూ.1,85,854) 7.3 రెట్లు ఎక్కువ.
ALSO READ: Game Changer బృందం కేవలం పాటల షూటింగ్ కోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా?