HomeTelugu Trendingకేసీఆర్‌ హామీలపై సినీ ప్రముఖుల కృతజ్ఞతలు

కేసీఆర్‌ హామీలపై సినీ ప్రముఖుల కృతజ్ఞతలు

Tollywood celebrities thank

కరోనా వైరస్‌ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితతే తెలంగాణ సీఎం కేసీఆర్ తన పార్టీ జి.హెచ్.ఎం.సి ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించడంతో పాటు టాలీవుడ్‌కు అనేక వరాలిచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమకు పలు హామీలు ఇచ్చారు. కరోనా దెబ్బతో తీవ్ర ఆర్థిక నష్టాలు బారిన పడ్డిన టాలీవుడ్‌ను కాపాడుకోవటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వపరంగా రాయితీలు, మినహాయింపులు ఇస్తామని ప్రకటించారు. ఇక సినిమా థియేటర్ల ఓపెనింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీటింగ్‌తో తెలంగాణలో సినిమా థియేటర్లకు అనుమతి ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించింది.

దీనిపై సినీ ప్రముఖులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. కరోనాతో కుదేలైన సినిమారంగానికి వరాల జల్లు కురిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, కష్టసమయంలో ఇండస్ట్రీకి తోడుగా నిలుస్తున్నారంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ రీట్వీట్ చేస్తూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ తెలియజేశాడు. నాగార్జున స్పందిస్తూ.. కోవిడ్ లాంటి అనిశ్చిత సమయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైన సహాయక చర్యలకు తోడ్పడుతున్న సీఎం కెసిఆర్ కి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ ద్వారా తెలియపరిచాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu