వర్మ ఆ సినిమా కాపీ కొడుతున్నాడా..?

రామ్ గోపాల్ వర్మ నాగార్జున సినిమా ప్రారంభం అయి ఒక్కరోజు గడవకుండానే ఆ సినిమా కధ ఒక  బ్లాక్ బస్టర్  హాలీవుడ్ సినిమాకు కాపీ అంటూ గాసిప్పుల హడావిడి మొదలు అయిపోయింది. ఈచిత్రంలో నాగార్జున పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఇప్పటికిప్పుడు ఫైనల్ అయింది కాదు కొద్ది నెలలుగా దీనిపై డిస్కషన్లు నడుస్తున్నట్లు టాక్. ప్రస్తుతం టాలీవుడ్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈసినిమా కథ   2008లో హాలీవుడ్ లో వచ్చిన టేకెన్ అనే సినిమా తరహాలో ఉంటుంది అని తెలుస్తోంది. 

కిడ్నాప్ అయిన తన కూతురిని ఎక్స్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అయిన హీరో ఎలా రక్షించుకున్నడు అనేది అసలు కథ. అదే కాన్సెప్ట్ స్టొరీని వర్మ కొద్దిగా మార్చి మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై వర్మ స్పందిస్తాదేమో చూడాలి!