HomeTelugu Trending'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' కు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణ!

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ కు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణ!

5 28సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ కష్టాల్లో పడిపోయింది… ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించి మేకాలడ్డగా.. సెన్సార్ బోర్డు అభిప్రాయాన్ని కోరుతూ హైకోర్టు సినిమా విడుదలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. అయితే, అసలు సమస్య ఇప్పుడే వచ్చింది.. ఈ సినిమాను చూసిన బోర్డు.. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. మూవీలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని.. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు అభిప్రాయపడి.. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. అయితే, సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మేకర్స్.. రివైజింగ్ కమిటీకి వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా కాస్త వెనక్కి తగ్గిన ఆర్జీవీ.. సినిమా టైటిల్ మార్చడానికి కూడా అంగీకరించారు… అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ పెడతామని కూడా తెలిపారు. అయితే, సెన్సార్ సర్టిఫికెట్ మాత్రం అందుకోలేకపోయారు.

ఇక, వర్మ సినిమా పేరును.. ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచీ పెద్ద ఎత్తున చర్చ జరిగింది.. మేకర్స్ విడుదల చేసిన సినిమా రెండు ట్రైలర్స్‌తో తీవ్ర దుమారమే రేగింది.. దీంతో ఈ సినిమా టైటిల్ పై మొదట వివాదం రేగగా.. ఆర్జీవీ వెంటనే టైటిల్ ను అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని మార్చినా ఉపయోగం లేకుండా పోయింది.. ఈ మూవీలో వివాదాస్పద అంశాలున్నాయి… ఈ మూవీ రెండు కులాల మధ్య గొడవలను సృష్టించే అవకాశం ఉందనే వాదనలు వినిపించాయి.. ఇప్పుడు సెన్సార్ బోర్డు నిర్ణయంతో సినిమా పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!