
Ram Gopal Varma Latest Interview:
తెలుగు సినీ ప్రియులకు రామ్ గోపాల్ వర్మ (RGV) పేరు ప్రత్యేకమైనదే. ‘శివ’ సినిమాతో తెలుగు సినిమాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వర్మ, ఆ తర్వాత తనదైన శైలిలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. అయినా, ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడుకునే వీలూ, ఆసక్తీ తక్కువ కాలేదు.
ఇటీవల RGV ఓ ఇంట్రెస్టింగ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. టెలుగు వ్లాగర్ వంశీ నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలో ఆయన సినిమాలు, రివ్యూలు, సెన్సార్, ప్రేక్షకుల అభిరుచులు తదితర విషయాలపై మాట్లాడాడు.
ఇంటర్వ్యూలో ఒక హైలైట్ ఏంటంటే – వర్మ ఒక సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాడు – అది ‘అనిమల్’ సినిమాలో రణబీర్ కపూర్ మెషిన్ గన్‌తో క్లాస్‌రూమ్‌లోకి రావడం. ఆ సీన్ చూస్తే తాను ఫుల్‌గా హై అయ్యానని వర్మ బహిరంగంగా చెప్పాడు. అందులో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా టేకింగ్‌ను కూడా అభినందించాడు.
అంతేకాదు, వర్మ ‘అనిమల్’లోని కొన్ని ఇతర సీన్‌ల గురించి కూడా ప్రశంసించాడు. అలాగే, క్రిస్టఫర్ నోలన్ తీసిన ‘ఒపెన్‌హైమర్’ గురించి, టామ్ క్రూస్ నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ గురించి కూడా కొద్దిసేపు మాట్లాడాడు.
ప్రస్తుతం వర్మ ‘సిండికేట్’ అనే సై-ఫై క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నాడు. ఇది భారతదేశ భవిష్యత్తును ఆధారంగా చేసుకుని రూపొందుతున్న కథ. ఓ శక్తివంతమైన మాఫియా గ్రూప్ దేశ భద్రతను ఎలా కుదిపేస్తుందన్నదే కథా సారాంశం. ఇది టెక్నాలజీ, టెర్రరిజం, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇలా చాలామందికి నచ్చే అంశాలతో ఉండబోతుందని చెప్పొచ్చు.
ALSO READ: June Releases జాబితాలో పెద్ద సినిమాలు ఇవే!