దేశ జనాభా లెక్కలు వాయిదా వేసిన కేంద్రం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో యావత్ భారత దేశం ఆగిపోయింది. కరోనా ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ఇప్పుడు ఏప్రిల్ 1 న ప్రారంభం కావాల్సిన జనాభా లెక్కల సేకరణ కూడా వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తొలి దశ జనాభా లెక్కల సేకరణను కేంద్ర హోం శాఖ నిరవధికంగా వాయిదా వేసింది. ఎన్పీఆర్ అమలును కూడా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా లెక్కల సేకరణ తొలిదశతోపాటు ఎన్పీఆర్ అమలును కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది. కరోనా ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాతనే జనాభా లెక్కల సేకరణ ప్రారంభించే అవకాశముంది.