కమల్‌తో చేతులు కలిపేందుకు సిద్ధం: రజనీ

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ పార్టీని ఎప్పుడు ప్రారంభిస్తారా? అని ఆయన అభిమానులతో సహా, దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టే విషయమై రజనీ సైతం స్పష్టత ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా మారాయి. ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అనిపిస్తే కమల్‌హాసన్‌, తానూ కలిసి పనిచేసేందుకు సిద్ధమని రజనీకాంత్‌ అన్నారు.

అంతకుముందు రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపై కమల్‌హాసన్‌ స్పందిస్తూ.. గత 44ఏళ్లుగా తమ స్నేహం కొనసాగుతోందని, అవసరమైతే తమిళనాడు అభివృద్ధికి తాము కలిసి పనిచేస్తామని అన్నారు. అనంతరం కొద్దిసేపటికే రజనీకాంత్‌ పైవిధంగా స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు దీటుగా రాజకీయంగా ముందుకు సాగడం కత్తిమీద సాములాంటిదే. ఈ పరిస్థితుల్లో ఇరువురి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.