Homeతెలుగు Newsమోడీ వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు

మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు

8 9తనను దూషించడానికి మాత్రమే ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి ఇక్కడకు వచ్చారని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కానీ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండానే తిట్టి వెళ్లిపోయారని విమర్శించారు. విజయవాడలో లక్ష నివాస స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

‘నన్ను దూషించడం కోసమే మోడీ ఢిల్లీ నుంచి వచ్చారు. తిట్టేసి పారిపోయారు. ఏం చేశారో జవాబు చెప్పలేకపోయారు. ఎందుకు అన్యాయం చేశారని రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు. రాష్ట్ర హక్కుల కోసం ఇప్పటికే పోరాడుతూనే ఉన్నాం. కాంగ్రెస్‌ పార్టీ తల్లిని చంపి బిడ్డను కాపాడిందని మోడీ చెప్పారు. తల్లిని కూడా దగా చేసిన వ్యక్తి మోడీ. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు. విభజన చట్టం హామీలు అమలు చేయాలని 29 సార్లు ఢీల్లీ వెళ్లా. రాష్ట్రానికి మట్టి, నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే 15 సీట్లు అదనంగా వచ్చేవి. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలను ఊచకోత కోశారు. అప్పుడు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశా. అది మనసులో పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నారు.

కేసుల మాఫీ కోసమే జగన్‌ బీజేపీతో లాలూచీ పడ్డారు. బీజేపీ సభకు జనం రారని తెలిసి వైసీపీ జన సమీకరణ చేపట్టింది. అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినట్లు చెబుతున్నారు. రెండు ప్రభుత్వాలు కలిసి అమరావతి నిర్మాణం చేయాల్సి ఉంది. ఢిల్లీ కంటే గొప్ప నగరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కియా మోటార్స్‌ పరిశ్రమను కేంద్రమే ఇచ్చినట్లు చెబుతున్నారు. నేనేదో యూటర్న్‌ తీసుకున్నానని మోడీ అంటున్నారు. నాది రైట్‌ టర్న్‌. మీదే యూటర్న్‌. 670 అవార్డులు ఇచ్చారు. మళ్లీ మీరే విమర్శిస్తున్నారు. నేను ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచానని అంటున్నారు. గురువుకు నామాలు పెట్టింది మీరు. అద్వాణీ నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టని సంస్కారం మీది’ అని చంద్రబాబు ఎద్దేవాచేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu