కేంద్రాన్ని చూసి నేను భయపడడం లేదు: బాబు

ఇవాళ పలాసలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ కేంద్రానికి మనసు లేదన్నారు. తిత్లీ ధాటికి ఉత్తరాంధ్ర అతలాకులమై తీవ్ర నష్టం జరిగినా కేంద్రం కనీసం స్పందించలేదని అన్నారు. కేంద్రాన్ని చూసి తాను భయపడడం లేదన్న బాబు.. వారి తప్పుల్ని దేశవ్యాప్తంగా ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఢిల్లీలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని.. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ‘దేశం కోసం అన్ని పార్టీలనూ ఒకే తాటిపైకి తెచ్చేందుకే నేను ఢిల్లీ వెళ్లా.. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ సాయం కోరా.. ఎంత అణగదొక్కాలని చూస్తే…కేంద్రాన్ని అంత తీవ్రంగా తిప్పికొడతాం’ అని బాబు స్పష్టం చేశారు.