9మంది రెబల్స్‌ పై టీడీపీ వేటు

ఎన్నికల బరిలో రెబల్‌ అభ్యర్థులుగా నిలిచిన 9మందిపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వేటు వేశారు. పార్టీ నిర్ణయాన్ని కాదని పోటీ చేసేందుకు సిద్ధమైన వీరందరిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయించారు. రంపచోడవరం నుంచి ఫణీశ్వరి, గజపతిగనగరం నుంచి కె.శ్రీనివాసరావు, అవనిగడ్డ నుంచి కంఠమనేని రవిశంకర్‌, తంబాళ్లపల్లి నుంచి ఎం.మాధవరెడ్డి, ఎన్‌.విశ్వనాథరెడ్డి, మదనపల్లి నుంచి బొమ్మనచెరువు శ్రీరాములు, బద్వేల్‌ నుంచి ఎన్‌.విజయజ్యోతి, కడప నుంచి ఎ.రాజగోపాల్‌, తాడికొండ నుంచి సర్వా శ్రీనివాసరావును తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు టీడీపీ ప్రకటించింది.