మీరు బాహుబలి అయితే.. నేను మహా బాహుబలిని’: చంద్రబాబు

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ..’మీరు బాహుబలి అయితే.. నేను మహా బాహుబలిని’ అని కేసీఆర్‌ను ఉద్దేశించిన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఎన్నికల ప్రచారం ఆయన కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘తెలంగాణలో అన్ని పార్టీలను చంపేసిన కేసీఆర్ 16 సీట్లు గెలుస్తానని అంటున్నారు. టీఆర్‌ఎస్‌ 16 గెలిస్తే మేం 25 గెలిచి చూపిస్తాం. కేసీఆర్‌ మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం’ అని స్పష్టం చేశారు. తాను పిరికిపందను కాదని.. జాతికోసం ప్రాణాలిస్తానని చెప్పారు. ఆంధ్రుల జోలికి వస్తే అడ్రస్‌ గల్లంతు చేస్తామని హెచ్చరించారు చంద్రబాబు.

సైకిల్‌ చైన్‌పై జనసేన అధినేత పవన్‌ చేసిన వ్యాఖ్యలపై బాబు స్పందిస్తూ ‘ సైకిల్ చైన్ ను కేసీఆర్ ఎప్పుడో తెంపేశారిని పవన్ వ్యాఖ్యానిస్తున్నారు. కానీ మాది మామూలు సైకిల్ కాదన్న విషయం తెలుసుకోవాలి. మా సైకిల్ చైన్ ను దమ్ముంటే పట్టుకుని చూడండి’ అని సవాల్‌ విసిరారు. తమ సైకిల్ చైన్ దగ్గరకొస్తే షాక్ కొట్టి అక్కడే ఫినిష్ అయిపోతారని అన్నారు.