చందు మొండేటి కొత్త చిత్రం!

 

chandu

ప్రస్తుతం నాగచైతన్య, శ్రుతి హాసన్ జంటగా చందు మొండేటి మళయాళ రీమేక్ గా ‘ప్రేమమ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఐ డ్రీమ్ మీడియా సంస్థ నిర్మించే చిత్రానికి చందు దర్శకత్వం వహించనున్నారు. నిఖిల్ హీరోగా ‘కార్తికేయ’ చిత్రాన్ని రూపొందించి, తొలి ప్రయత్నంలోనే దర్శకునిగా తనదైన బాణీ పలికించారు. రెండో చిత్రం ‘ప్రేమమ్’తోనూ చందు మొండేటి తనదైన శైలిని పలికిస్తారని తెలుగు చలనచిత్రసీమ లోని పలువురి అభిప్రాయం. ఈ చిత్రం దసరా కానుకగా 2016 అక్టోబర్ లో జనం ముందు నిలువనుంది. ఈ సినిమా తరువాత ‘ఐ డ్రీమ్ మీడియా’ సంస్థ చిత్రానికి దర్శకత్వం వహించబోవడం ఆనందంగా ఉందని చందు మొండేటి పేర్కొన్నారు. ” ప్రస్తుతం ఓవర్సీస్ తెలుగు సినిమాకు మరో ప్రధాన కేంద్రంగా మారింది. తెలుగు సినిమాను అంతర్జాతీయంగా విడుదల చేయడంలో ఐ డ్రీమ్ మీడియా ప్రధాన భూమిక పోషిస్తోంది. అలాగే ఈ సంస్థకు పదునైన ఆలోచనలు చేసే యంగ్ టీమ్ ఉండడం మరో ఎస్సెట్. ఈ సంవత్సరం ఆఖరులోగా ఈ చిత్రం సెట్స్ కు వెళ్తుంది. నటీనటవర్గం, సాంకేతికనిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాము” అని చందు తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates