సుకుమార్ షాక్ ఇచ్చేలా ఉన్నాడే!

సుకుమార్ సినిమా అంటే కొత్తదనానికి పేరు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఆయన ఆలోచనలు ఉంటాయి. ఆయన నుండి ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా అందరి కళ్ళు ఆ సినిమాపై పడతాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లో జరిగాయి. అయితే ఈ సినిమాలో సుక్కు, చరణ్ ను ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలో నెలకొంది.

అంతే కాదు ఈ సినిమాతో మరో కొత్త పాయింట్ ఏం చెప్పబోతున్నాడని అందరూ చర్చించుకుంటున్నారు. దానికి తగ్గట్లే సినిమా ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేసి అందరికీ ఓ షాక్ ఇచ్చాడు. కావిడ పట్టుకున్న రైతుని ఆర్ట్ రూపంలో పోస్టర్ గా విడుదల చేశారు. ఆ రైతే చరణా..? లేక రైతుల కోసం పాటుపడే నాయకుడు చరణ్ అనుకోవాలా..? మొత్తానికి ఈ పోస్టర్ ను బట్టి సినిమా ఎలా ఉండబోతుందో అంచనా వేయడం కష్టమే. ఎలాంటి కథో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!