చరణ్, రాజుగారికి ఓకే చెప్తాడా..?

దిల్ రాజు, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఎవడు’ సినిమా మాస్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. కమర్షియల్ గా ఈ సినిమా బాగా వర్కవుట్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ సెట్ కానున్నట్లు సమాచారం. సుకుమార్ తో సినిమా చేస్తోన్న రామ్ చరణ్ తన తదుపరి సినిమా మణిరత్నంతో చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ కాంబో సెట్ అయ్యే అవకాశాలే కనిపించడం లేదు. సుకుమార్ సినిమా దసరా నాటికి విడుదల కానుంది. ఈలోగా చరణ్ తన తదుపరి సినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలి.

అయితే చరణ్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ఇప్పటికే ఓ స్టార్ డైరెక్టర్ ని కలిసి కథ కూడా సిద్ధం చేయమన్నట్లు తెలుస్తోంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఆ కథ చరణ్ కు వినిపించి ఓకే చెప్పించుకోవాలని చూస్తున్నాడు దిల్ రాజు. మరి దిల్ రాజు వ్యూహం ఫలిస్తుందా..? చరణ్
తన తదుపరి సినిమా దిల్ రాజు బ్యానర్ లో చేస్తాడా..? అనే విషయం తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!