చరణ్ తో రాశిఖన్నా రొమాన్స్!

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయిన పంజాబీ ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఆ సినిమాలో తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామకు వరుస అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఇటీవలే సుప్రీం, హైపర్ చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ త్వరలోనే చరణ్ సినిమాలో నటించనుందని సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం ‘దృవ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్ డైరెక్షన్ లో గ్రామీణ నేపధ్యంలో సాగే ఓ సినిమాలో చరణ్ నటించనున్నాడు. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఇటీవల కొందరిని ఆడిషన్స్ చేశారు. వారిలో రాశిఖన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలానే ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ రోల్ కోసం ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. సుకుమార్ ఇప్పటివరకు రూపొందించిన చిత్రాల్లో ఒక హీరోయిన్ మాత్రమే ఉండేవారు. తొలిసారి ఇద్దరు హీరోయిన్లు ఉండే కథను సిద్ధం చేశాడు ఈ దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.