మంచు హీరోతో వినాయక్!

మాస్ ఆడియన్స్ లో దర్శకుడు వి.వి.వినాయక్ కు ఉన్న క్రేజే వేరు. ఇటీవల ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో తన ఖాతాలో మెగా హిట్ సినిమా వేసుకున్న వినాయక్ తన తదుపరి సినిమా యంగ్ హీరో సాయి ధరం తేజ్ తో.. లేకపోతే గోపిచంద్ తో ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని ఆయా హీరోలు తేల్చేశారు. ఈ నేపధ్యంలో వినాయక్ మరో యంగ్ హీరోతో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడని టాక్.

ఇటీవల గుంటూరోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచు మనోజ్ తన తదుపరి సినిమా వినాయక్ తో కలిసి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కథకు సంబంధించి ఫైనల్ వెర్షన్ ను కన్ఫర్మ్ చేశారని.. ప్రస్తుతం బడ్జెట్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయని అంటున్నారు. ఇదే గనుక నిజమైతే.. ఎన్నో రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న మనోజ్ కు ఈ సినిమాతో అది దక్కుతుందని చెప్పొచ్చ్హు!