చరణ్ టైటిల్ తేడాగా ఉందే!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘దృవ’ సినిమాలో
నటిస్తున్నాడు. ఈ సినిమా డిసంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే
ఈ సినిమా తరువాత చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు
‘ఫేస్ బుక్ లైవ్ చాట్ ఎట్ 8.18 పిఎమ్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్.
గ్రామీణ నేపధ్యంలో సాగే ఇలాంటి కథకు ఈ టైటిల్ ఎంతవరకు సెట్ అవుతుందనే అభిప్రాయాలూ
వ్యక్తమవుతున్నాయి. పైగా ఇది జనంలోకి వెళ్ళే టైటిల్ లా అనిపించడం లేదు గనుక టైటిల్
గా పెట్టే అవకాశాలు లేవని కొందరు అంటున్నారు. ఒకవిధంగా ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకోవడానికే
ఇలా టైటిల్ ను లీక్ చేశారని తెలుస్తోంది. యూత్ ఇలాంటి టైటిల్స్ కు కనెక్ట్ అయినా.. ఫ్యామిలీ
ఆడియన్స్ కు మాత్రం పెద్దగా ఎక్కదు. మరి ఫైనల్ గా ఏం చేస్తారో చూడాలి!