చరణ్ తో నాని డైరెక్టర్.. క్లారిటీ వచ్చింది!

దిల్ రాజు బ్యానర్ లో గతంలో ‘ఎవడు’ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో నటించాడు రామ్ చరణ్. ఆ సినిమా సమయంలో దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు. అయితే ఇటీవల అల్లు అర్జున్ తో సినిమా చేసిన దిల్ రాజు ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో హరీష్ శంకర్ తో చరణ్ కు ఓ కథ చెప్పించాలని ప్లాన్ చేశాడు. కానీ చరణ్ మాత్రం హరీష్ శంకర్ విషయంలో ఆసక్తిగా లేడని టాక్. ఇప్పుడిప్పుడే రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కొత్తగా ఉండే కథలను ఎన్నుకుంటున్న చరణ్ మళ్ళీ రొటీన్ కమర్షియల్ సినిమా చేయడానికి రెడీగా లేడు. అందుకే హరీష్ కు బదులుగా త్రినాధ రావు నక్కిన మంచి కథను గనుక వినిపిస్తే సినిమా చేస్తానని రామ్ చరణ్ స్వయంగా దిల్ రాజుకి చెప్పినట్లుగా తెలుస్తోంది. 
త్రినాధరావు డైరెక్ట్ చేసిన ‘నేను లోకల్’ సినిమా చూసి ఇంప్రెస్ అయిన చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మీడియం రేంజ్ సినిమాలు చేసిన త్రినాధరావు ఇప్పుడు చరణ్ కోసం కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చరణ్ నుండి ఊహించని విధంగా ప్రపోజల్ రావడంతో దిల్ రాజు కూడా సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టాడు. ఇక త్రినాధరావు తన కథతో చరణ్ ను మెప్పించడం ఆలస్యం.. ప్రస్తుతం ‘రంగస్థలం’ సినిమాలో నటిస్తోన్న చరణ్ ఆ తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నాడు. ఆ తరువాత దిల్ రాజు ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి.