ఏఆర్ రెహ్మాన్ నిరాహారాదీక్ష!

తమిళనాట జల్లికట్టు వివాదం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. సినీ సెలబ్రిటీలు ఈ నిరసనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోలతో పాటు శింబు, శివకార్తికేయన్ వంటి యంగ్ హీరోలు ఈ నిరసనలో పాల్గొంటున్నారు. ఇప్పుడు వారికి మద్దతును ప్రకటిస్తూ..
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత అయిన ఏఆర్ రెహ్మాన్ నిరాహార దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. దీంతో జల్లికట్టుకి సపోర్ట్ చేస్తున్న వారందరికీ మరింత బలం చేకూరింది.

ఈ నిరాహార దీక్ష రేపటి నుండి జరగనుంది. ఇలా రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి ప్రముఖుల వరకు అందరూ తమిళ సంస్కృతిని కాపాడలంటూ… కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈరోజు మొత్తం తమిళనాట సినీ రంగానికి సంబంధించిన ఎలాంటి పనులు జరగడం లేదు. ఈ నిరసనలో ప్రజలకు మద్ధతుగా రాజకీయ నాయకుల కంటే సినీ రంగ ప్రముఖులే నిలవడం విశేషం.