HomeTelugu Newsకరోనాకు ఛార్మీ స్వాగతం.. నెటిజన్లు ఫైర్‌.. రీట్వీట్‌

కరోనాకు ఛార్మీ స్వాగతం.. నెటిజన్లు ఫైర్‌.. రీట్వీట్‌

15
నటి చార్మీపై ప్రస్తుతం నెటిజన్లు మండిపడుతున్నారు. దానికి కారణం ఈ అమ్మడు చేసిన ఓ టిక్ టాక్ వీడియో. ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా గురించి అంతా భయపడుతున్నారు. ఇప్పటికే చైనా లో 3000ల మంది మృత్యువాత పడ్డారు. ఇంకొంతమంది ఆ వైరస్ బారిన పడి హాస్పటల్ లో చావు బ్రతుకులమధ్య కొట్టుకుంటున్నారు. తాజాగా ఈ వైరస్ ఢిల్లీ, తెలంగాణకు కూడా వచ్చిసింది. దాంతో భయం తో దేశ ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో చార్మీ వేటకారంగా ఓవీడియో చేసి పోస్ట్ చేసింది. “కరోనా వచ్చేసిందంట.. నేను ఇప్పుడే వార్తల్లో చూసాను. అల్ ది బెస్ట్, స్వాగతం అంటూ ఎటకారంగా ఒక నవ్వు నవ్వింది “ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈవీడియో చుసిన కొందరు చార్మీ పై ఫైర్ అవుతున్నారు. సామాన్య ప్రజలు ప్రాణాలు గుపెట్లో పెట్టుకొని బ్రతుకుతుంటే చార్మీ సంబరపడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియో ఓ రేంజ్‌లో వైరల్‌ కావ్వడంతో సమాధానంగా ఛార్మీ మరో ట్వీట్‌ చేసింది. ‘నేను ఇలాంటి సందర్భంలో అలాంటి వీడియో పోస్ట్‌ చేయడం తప్పు. మీరు చేసిన కామెంట్స్‌ అన్నీ చదివాను. ఇది చాలా సున్నితమైన అంశం అని నేను భావించలేకపోయాను. ఈ చర్య పట్ల నేను క్షమాపణలు కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావు’ అంటూ ట్వీట్‌ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!