HomeTelugu Big Stories'చతుర్ముఖం' ట్రైలర్‌

‘చతుర్ముఖం’ ట్రైలర్‌

Chathur Mukham Trailer
మంజు వారియర్‌, సన్నీ వెనె, శ్రీకాంత్‌ మురళి ప్రధానపాత్రలు పోషించిన మలయాళ చిత్రం ‘చతుర్ముఖం’ ఏప్రిల్‌లో విడుదలై ప్రశంసలు అందుకుంది. రంజిత్ కామ‌ల శంక‌ర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తెలుగు అభిమానుల కోసం ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ డబ్‌ చేసింది. ఈ నెల 13 నుంచి అందుబాటులోకి రానుంది. కాగా.. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఆహా యూట్యూబ్‌ వేదికగా షేర్‌ చేసింది.

జీవితంలో ఒక అమ్మాయికి కావాల్సినవి విద్య, ఆర్థికంగా బాగా ఉండటం.. ఈ రెండూ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి.. అనే సంభాషణతో సాధారణంగా ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌.. ఉత్కంఠ రేపుతూ సాగుతుంది. దెయ్యాలు, భూతాలున్నాయంటే నమ్మని ఓ మధ్య తరగతి అమ్మాయిని ఏదో కనిపించని శక్తి వెంటాడుతూ ఉంటుంది. తన ఫోన్లోనే తనకు తెలియకుండా దూరిపోయి ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ అమ్మాయి ఆ శక్తిని ఎలా ఎదురించింది. ఆమె ఎలాంటి ఇబ్బందులు పడింది అనేదే కథ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu