సుకుమార్, చరణ్ ఓ ఆర్ట్ ఫిల్మ్..?

సుకుమార్ ప్రయోగాత్మక సినిమాలంటే ముందుంటాడు. ఆయన సినిమాలు ఓ పక్క కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటూనే ఓ డిఫరెంట్ పాయింట్ ను టచ్ చేస్తూ ఉంటాడు. ఈసారి రామ్ చరణ్ సినిమాకు మాత్రం ఓ లవ్ స్టోరీ ఎన్నుకున్నాడు. ఎనభైల దశకంలో జరిగే ఓ ప్రేమ కథే ఈ సినిమా. ఈ సినిమాలో చరణ్ చెవిటి వాడిగా కనిపించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. దీంతో చెర్రీ ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాడనే టాక్ వినిపించింది. ఇప్పుడు మరో వార్త సుకుమార్ ఏమైనా ఆర్ట్ సినిమా చేస్తున్నాడా..? అనే భావన కలిగిస్తోంది.

సినిమాలో హీరోయిన్ గా చేస్తోన్న సమంతది మూగ అమ్మాయి పాత్రట. హీరోకేమో చెవుడు.. హీరోయిన్ ఏమో మూగది. వీరిద్దరూ కూడా కళ్ళతోనే ప్రేమించుకుంటారని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే సుకుమార్ ఆర్ట్స్ సినిమా చేస్తున్నాడా..? లేదా అవార్డ్స్ కోసం సినిమా చేస్తున్నాడా..? అనే అనుమానాలు రాక మానవు. మరి ఈ ప్రేమకథ ఎంతవరకు సక్సెస్ అవుతుందో.. చూడాలి!