బంగార్రాజు రవితేజకు వెళ్లింది!

కల్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన మొదటి రెండు చిత్రాలు ‘సోగ్గాడే చిన్ని నాయన’,’రా రండోయ్ వేడుక చూద్దాం’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేశాయి. సోగ్గాడే సినిమా తరువాత ఆ సినిమాలో బంగార్రాజు క్యారెక్టర్ ను బేస్ చేసుకొని కల్యాణ్ కృష్ణ ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. నాగార్జున ఈ సినిమాలో నటించడానికి కూడా అంగీకరించారు. కానీ ప్రస్తుతం నాగ్ ఈ సినిమాలో నటించే అవకాశం లేదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే కథను కొన్ని మార్పులు చేసి రవితేజకు వినిపించాడట కల్యాణ్ కృష్ణ.

సోగ్గాడే సినిమాకు ప్రీక్వెల్ గా కాకుంగా ఓ కొత్త కథగా మలిచి రవితేజకు వినిపించాడు. అందుకే రవితేజకు నచ్చిందని సమాచారం. ఇటీవల ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో సక్సెస్ అందుకున్న రవితేజ ప్రస్తుతం ‘టచ్ చేసి చూడు’ సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు. దాని తరువాత శ్రీనువైట్లతో మరో ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. ఈ క్రమంలో కల్యాణ్ కృష్ణతో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉందని సమాచారం.