భయపడటానికి చంద్రబాబు తప్పేమీ చేయలేదు..

ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఎవరికీ భయపడి సీబీఐ సమ్మతి విరమించుకోలేదని అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు సమ్మతి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏపీ నిర్ణయానికి జాతీయ స్థాయిలో మద్దతు లభించిందని చెప్పారు. కేంద్రం సీబీఐ, రిజర్వ్‌ బ్యాంకులను తన చేతుల్లో పెట్టుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. సీబీఐకి భయపడటానికి చంద్రబాబు తప్పేమీ చేయలేదన్నారు. అలాగే వైఎస్‌ జగన్‌ కోడికత్తి నాటకం ప్రజలందరికీ అర్థమైందని అన్నారు. ఈ వ్యవహారంపై సిట్‌ విచారణ త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. వైసీపీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో జనం లేరని చినరాజప్ప అభిప్రాయపడ్డారు.