చింతమనేని అరెస్ట్‌

దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు.. 2 వారాల తర్వాత అజ్ఞాతం వీడిన చింతమేనని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం దుగ్గిరాలలోని తన నివాసానికి వచ్చారు చింతమనేని.. తన భార్య అనారోగ్యానికి గురికావడంతో.. ఆమెను చూసేందుకు చింతమనేని ఇంటికి రాగా.. వెంటనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే, చింతమనేని అరెస్ట్‌ను అడ్డుకునేందుకు ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో కాసేపు హైడ్రామా నడిచింది. కాగా, దళితులను దూషించిన కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు… ఆయనను రహస్య ప్రాంతానికి తరలించారు. ఇక, ఆయనపై పెండింగ్‌లో ఉన్న ఇతర కేసులను సంబంధించి కూడా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.