మెగా ఈవెంట్ ప్లానింగ్ అదిరింది!

అందరూ ఎంతగానో ఎదురుచూసిన మెగాస్టార్ 150వ సినిమా ప్రారంభమయ్యి అతి త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకోబోతోంది. రామ్ చరణ్ తేజ్  కొణిదల ప్రొడక్షన్స్ కంపనీలో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకపై అభిమానుల ఆసక్తి పెరిగింది. వారి అంచనాలకు ఏ మాత్రం  తగ్గకుండా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను ప్లాన్ చేస్తున్నారు. దృవ సినిమా విడుదలయిన తరువాత ఆడియో రిలీజ్ చేయాలని చిరు భావిస్తున్నాడట.   కాబట్టి డిసంబర్ రెండో వారంలో ఖైదీ నెంబర్ 150 సినిమా పాటలను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
 
ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ అతిథిగా వస్తాడని భావించారంతా. అయితే ఇప్పుడు ఈ గెస్ట్ ల సంఖ్య బాగా ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది.  అలనాటి స్టార్ హీరోలు నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు లను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు చెబుతున్నారు. అంతేకాదు ఇప్పటివరకు చిరంజీవితో పని చేసిన చాలా మంది దర్శకులకు ఆహ్వానాలు పంపుతున్నారు. మెగాహీరోలతో పాటు మిగిలిన సినీ  ప్రముఖులందరితో ఈ వేడుక వెలిగిపోవడం ఖాయమనిపిస్తోంది. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.