చిరుకి జీరో.. నయన్ కు నాలుగు కోట్లు!

చిరంజీవి 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’లో కథానాయికగా నటి నయనతారను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం నయన్ కు దాదాపు నాలుగు కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా ముట్టజెప్పనున్నారు. సాధారణంగా ఒక సినిమాకు గాను నయనతార రెండు నుండి రెండున్నర కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తుంది. కానీ చిరు సినిమాకు ఏకంగా నాలుగు కోట్లు ఆడుకోబోతుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించనున్నారు. అంతేకాదు నిర్మాతలు ఈ సినిమా మలయాళ, హిందీ భాషల్లోకి అనువదించాలనుకుంటున్నారు. 
దీంతో నయన్ కు నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు చిత్రనిర్మాతలు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆమె పాల్గొనడానికి అంగీకరించిందని సమాచారం. రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొనిదల ప్రొడక్షన్స్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు కాబట్టి చిరంజీవికి ఇంత అని రెమ్యూనరేషన్ ఇచ్చే అవసరం ఉండదు. ఆగస్ట్ 15న ఈ సినిమాను లాంఛనంగా మొదలుపెట్టనున్నారు. సెప్టెంబర్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన వెలువడనుంది.