బాలయ్య ఇక మారవా..?

ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి తన అసహనాన్ని కార్యకర్తపై చూపించారు. తనకు అడ్డుగా వస్తున్నాడనే ఒక్క కారణంతో తెలుగు దేశం పార్టీ కార్యకర్త చెంపచెళ్లుమనిపించారు. హిందూపురంలో బోయపేటలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిజానికి బాలయ్య ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారి. గతంలో కూడా ఆయన ఇలాంటి ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. బాలయ్య ఎన్ని కొట్టినా అభిమానులు మాత్రం దాన్ని ఆశీర్వాదమనే అంటారు. ఎంతైనా.. ఎమ్మెల్యే వంటి పేరున్న పొజీషన్ లో ఉండి బాలయ్య ఈ విధంగా ప్రవతించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయినా బాలయ్య అలాంటివి ఏ మాత్రం పట్టించుకోరు. చెంప కనిపిస్తే చెళ్లుమనిపించడం తప్ప ఆలోచించడానికి ప్రయత్నించడం లేదు. మొన్నా మధ్య పూరి జగన్నాథ్ ‘బాలయ్య అభిమానులను ప్రేమిస్తాడు.. అందుకే కొడతారు’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరేం అన్నా.. బాలయ్య తన సంయమనాన్ని కోల్పోతున్నారనేది నిజం. మరి ఇకనైనా బాలయ్య తన గర్వాన్ని పక్కన పెట్టి హుందాతనాన్ని ప్రదర్శించాలని కోరుకుందాం!