
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత మరింత జోష్‌తో దూసుకుపోతున్నారు. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఎన్నో చిత్రాలను చేసి ప్రేక్షకులను, అభిమానులను ఓ రేంజ్‌లో అలరించారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నారు. ఈ మూవీలో చిరంజీవిని ఢీకొట్టేందుకు టాలీవుడ్ హీరో రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ భారీ నష్టాలతో డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం మెగాస్టార్ ఇప్పుడు ‘బింబిసార’ దర్శకుడు మల్లిడి వశిష్టతో ఓ సినిమాను చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పంచ భూతాలను చూపించి ఆసక్తిని పెంచేశారు. అదే సమయంలో ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్నట్లు కూడా రివీల్ చేసేశారు.
యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్టతో చేయబోయే సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మాదిరిగా ఉండబోతుందని సమాచారం. మానవుడైన హీరో పలు లోకాలను చుట్టి వచ్చేలా వరం పొందుతాడట. ఆయా లోకాల్లో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కబోతుందని చెప్తున్నారు.
క్రేజీ కాన్సెప్టుతో రూపొందుతోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన 8 మంది హీరోయిన్లు నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీలో విలన్‌గా స్టార్ హీరోను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. దగ్గుబాటి రానాను విలన్‌గా తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్లుగా అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది.
హీరో పాత్ర మూడు లోకాలను చుట్టి వచ్చేలా డిజైన్ చేశారట. అందుకే ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కాకుండా మరో రెండు మూడు టైటిళ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ మూవీని రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.













