HomeTelugu Trendingమెగాస్టార్‌ బర్త్‌డేకి ఆచార్య!

మెగాస్టార్‌ బర్త్‌డేకి ఆచార్య!

Acharya movie release on ch

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల డైరెక్షన్‌లో సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే చాలావరకూ పూర్తైయింది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగు నిలిచిపోయింది. సాధ్యమైనంత త్వరలో తిరిగి మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ముందుగా ఈ సినిమాను మే 14వ తేదీన విడుదల చేయాలని భావించారు. షూటింగులో అంతరాయాల కారణంగా వాయిదా వేశారు. దాంతో ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నారనేది ఫ్యాన్స్‌లో ఆసక్తికరంగా మారింది.

అయితే చిరంజీవి పుట్టినరోజు కారణంగా ఆగస్టు 22వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఈ సినిమా టీమ్ ఉందనే వార్తలు సోషల్‌ మీడియాలో స్ట్రాంగ్‌గా వినిపిస్తుంది. ఈ లోగా బ్యాలెన్స్ ఉన్న సీన్స్ ను .. రీ షూట్ చేయాలనుకున్న ఒకటి రెండు సీన్స్ ను పూర్తి చేసేస్తారట. ఆలస్యం అయినప్పటికీ చిరంజీవి బర్త్ డేకి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ నటించగా, చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu