చరణ్ ‘రంగస్థలం’లో చిరు, రాజమౌళి!

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ‘రంగస్థలం 1985’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపధ్యం గల ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో కొంత భాగం చిత్రీకరించి ఇప్పుడు హైదరాబాద్ లోనే గ్రామీణ సెట్ ను వేసి చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ కు మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి హాజరయ్యి సందడి చేశారు. షూటింగ్ చూడడానికి వెళ్ళిన ఈ ఇద్దరు కూడా యూనిట్ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఈ సంధర్భంగా తీసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
నిజానికి ‘మగధీర’ తరువాత రామ్ చరణ్ తో జక్కన్న ఓ సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి. అలానే సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకొస్తున్న చిరంజీవితో కూడా రాజమౌళి ఓ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో చిరు, జక్కన్న కలిసి చరణ్ సినిమా సెట్స్ కు వెళ్ళడం ఆసక్తిని కలిగిస్తోంది. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.