HomeTelugu Big Storiesపవర్‌ స్టార్‌ అభిమానిగా మెగాస్టార్‌?

పవర్‌ స్టార్‌ అభిమానిగా మెగాస్టార్‌?

Chiranjeevi as pawan kalyan

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్‌లో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థలపై ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమపై భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.

తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. డైరెక్టర్‌ మెహర్ రమేష్ మాత్రం ఈ సినిమాతో ఫ్యాన్స్ కు ట్రీట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్‌ గా మారింది.

Chiranjeevi

ఈ సినిమాలో చిరంజీవిని తన తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ని ఇమిటెడ్ చేయడమే కాకుండా ఒక పాటను కూడా రీమిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సింది.

చిరంజీవి పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలి అని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ టైమ్‌లో ఈ వార్త ఫ్యాన్స్‌కి ఇది గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. పవన్‌ కళ్యాణ్‌ తన పలు సినిమాల్లో చిరంజీవి అభిమానిగా కనిపించాడు. కానీ చిరంజీవి పవన్‌ కళ్యాణ్‌ అభిమానిగా కనిపించడం ఇదే మొదటి సారి.

చెక్కిన పాలరాతి శిల్పం లాంటి గ్లామర్ తో.. రుక్సార్‌ ధిల్లన్‌

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu