హీరో కోరుకునే నిర్మాత చరణ్!

చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకు నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నాడు. తండ్రి నటిస్తోన్న సినిమాను కొడుకు ప్రొడ్యూస్ చేయడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈరోజు సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఫంక్షన్ గుంటూరు హాయ్ లాండ్ లో వైభవంగా జరగబోతోంది. ఈ వ్యవహారాలను కూడా రామ్ చరణ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. దీని కోసం మెగాస్టార్ తనదైన స్టయిల్ లో స్పందించారు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల నిర్మాతలతో పోలిస్తే చరణ్ స్థానం ప్రత్యేకం అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాకు సాంకేతిక నిపుణులను ఎన్నుకోవడంలోనే నిర్మాతగా చరణ్ తొలి విజయాన్ని అందుకున్నాడని స్పష్టం చేశారు. ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతున్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి షూటింగ్ ఎలా జరుగుతుందంటూ.. వివరాలు తెలుసుకునేవాడు. అవసరమైన ప్రతిదీ సమకూర్చేవాడు. వినాయక్ తో తరచూ మాట్లాడుతూనే ఉండేవాడని అన్నారు. ఒక హీరో తన సినిమా నిర్మాత ఎలా ఉండాలని కోరుకుంటాడో.. చరణ్ ఆవిధంగా ఉన్నాడని చిరంజీవి స్పష్టం చేశారు.