HomeTelugu Big Storiesఅభిమానికి ఆర్థికసాయం చేసిన మెగాస్టార్‌

అభిమానికి ఆర్థికసాయం చేసిన మెగాస్టార్‌

Chiranjeevi provided
మెగాస్టార్ చిరంజీవి కష్టాల్లో ఉన్న తన అభిమానికి ఆర్థికసాయం చేసి పెద్ద మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ పట్టణానికి చెందిన భోనగిరి శేఖర్ అనే వ్యక్తి బజ్జీలు వేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. గత 30 ఏళ్లుగా చిరంజీవికి వీరాభిమానిగా ఉన్నాడు. రాష్ట్ర స్థాయిలో చిరంజీవి సేవా కార్యక్రమాలను సక్సెస్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఆయనకు వర్ష, నిశిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్ల పెద్దమ్మాయి వర్ష పెళ్లి ఈనెల 19న జరగనుంది. అయితే, శేఖర్ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని తెలుసుకున్న చిరంజీవి ఆయనకు లక్ష రూపాయల సాయం చేశారు. లక్ష రూపాయల చెక్కును పంపించారు. ఈ చెక్కును స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆయనకు అందించారు.

ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. రక్త సంబంధీకులు కూడా చేయని సాయాన్ని చిరంజీవి చేశారని అన్నారు. ఆయన రుణం తీర్చుకోలేనిదని కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న అభిమానిని ఆదుకున్న చిరంజీవిని దేవుడు చల్లగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సీఈవో రవణం స్వామినాయుడు, సంతోషం పత్రిక అధిపతి సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

Chiranjeevi provided financ

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!