HomeTelugu Trendingరాజమౌళితో సినిమా చెయ్యను: చిరంజీవి

రాజమౌళితో సినిమా చెయ్యను: చిరంజీవి

chiranjeevi says I dont wan

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ… ప్రముఖ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజమౌళి అత్యంత ప్రతిభ కలిగిన దర్శకుడని… మన దేశ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి అని చిరంజీవి కొనియాడారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజమౌళి చాలా లోతుగా చూస్తారని, ప్రతి ఒక్కటి ఎంతో పర్ ఫెక్ట్ గా రావాలని భావిస్తారని… ఆయన కోరుకునే ఔట్ పుట్ ను ఒక నటుడిగా తాను ఇవ్వగలనో, లేదో తనకు తెలియదని చెప్పారు. మరోవైపు రాజమౌళి ఒక్కో సినిమాను ఏళ్ల తరబడి తెరకెక్కిస్తారని… ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదేళ్ల పాటు తీసుకుంటారని… అంత సమయాన్ని తాను ఇవ్వలేనని అన్నారు. ప్రస్తుతం తాను ఒకే సారి నాలుగు చిత్రాలు చేస్తున్నానని చెప్పారు. ఈ కారణం వల్లే రాజమౌళితో సినిమా చేయాలని కానీ, పాన్ ఇండియా స్థాయి నటుడిగా పేరు తెచ్చుకోవాలని కానీ తనకు లేదని తెలిపారు. ఒక్క సినిమాకైనా దర్శకత్వం వహించాలనే కోరిక ఉందని చెప్పారు.

‘గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న విడుదల కానుంది. రాజకీయ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. మోహన్ రాజా డైరెక్షన్‌లో వచ్చిన ఈసినిమాలో.. సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, సత్యదేవ్ కీలక పాత్రలను పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!