HomeTelugu Trendingసిల్క్‌ స్మిత బయోపిక్‌లో శ్రీరెడ్డి

సిల్క్‌ స్మిత బయోపిక్‌లో శ్రీరెడ్డి

Sri reddy in silk smitha bi

వివాదస్ప నటి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ ఊరిస్తూ వస్తుంది. తాజాగా సన్సెస్‌ను రివీల్‌ చేసింది. దిగ్గజ నటి సిల్క్‌ స్మిత బయోపిక్‌ చేస్తున్నానని, మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది ఈ హాట్‌ బ్యూటీ. మధు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని శ్రీరెడ్డి తెలిపింది. సిల్క్‌ స్మితతో తనను తాను పోల్చకుంటూ ఓ ఫోటోను కూడా విడుదల చేసింది. అయితే ఈ బయోపిక్‌లో శ్రీరెడ్డి నటించడం పట్ల కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదట సిల్క్‌ స్మిత బయోపిక్‌లో యంకర్‌ అనసూయ నటించనున్నట్లు రూమర్స్‌ వచ్చాయి. అయితే అనసూయ సిల్క్ స్మిత బ‌యోపిక్‌లో న‌టించ‌డం లేద‌ని తేల్చి చెప్పింది. ఇప్పటికే సిల్క్‌ స్మిత జీవితకథ ఆధారంగా పలు భాషల్లో బయోపిక్‌లు విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో 2011లో డర్టీ పిక్చర్‌ పేరుతో విడుదలైన సిల్క్‌ స్మిత బయోపిక్‌లో నటి విద్యాబాలన్‌ నటించింది. ఈ సినిమాలో ఆమె యాక్టింగ్‌కి గానూ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu