‘సోలో బ్రతుకే సో బెటర్’ బ్రేకప్‌ సాంగ్‌

మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న తాజా చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్`. నేడు సాయి తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘అమృత’ పాటను విడుదల చేశారు. ఇప్పటికే సోలో బతుకే సో బెటర్ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. సోలో బ్రతుకే టీమ్ కూడా అతడికి బర్త్ డే శుభాకాంక్షలు అందించింది. హ్యాపి బర్త్ డే సుప్రీం హీరో సాయితేజ్ అంటూ శుభాకాంక్షలు తెలిపింది.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సాయి తేజ్ స్టైలిష్ కాలేజ్ బోయ్ గా కనిపించాడు. చేతిలో కాస్కో వాలీ బాల్ కనిపిస్తోంది. తదుపరి మంగళవారం మరో పాటను విడుదల చేయనున్నారు. ఈ పాట మెగా అభిమానులందరికీ ఎంతో ప్రత్యేకమైనదని చిత్ర బృందం ప్రకటించింది. పవన్ కల్యాణ్ ‘తొలి ప్రేమ’ నుండి స్పెషల్ సాంగ్ ‘గగనానికి ఉదయం ఒకటే…’ తిరిగి మెగా ఫ్యాన్స్ గుండెల్ని తాకనుందని రివీలైంది. ఈ రీమిక్స్ అభిమానుల్లోకి దూసుకెళుతుందని భావిస్తున్నారు. ఈ పాటను దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడటం ఇక్కడ ఆసక్తికర విషయం. తొలి ప్రేమలోనూ ఆయనే ఆలపించారు.

CLICK HERE!! For the aha Latest Updates