HomeTelugu Big Storiesఆర్జీవీపై అమృత ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఆర్జీవీపై అమృత ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

1 20
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరదీశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యకి సంబంధించిన సినిమా తీస్తున్న వర్మ (జూన్‌ 21) ఫాదర్స్‌ డే సందర్భంగా మూవీ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశాడు. అందులో మారుతీరావు, అమృత పాత్రలను పరిచయం చేస్తూ.. ‘ఓ తండ్రి తన కూతురుని అమితంగా ప్రేమిస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఇందులో చూపించబోతున్నా. ఫాదర్స్‌ డే రోజున ఒక విషాదభరితుడైన నాన్న పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్నా’ అంటూ వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దీనిపై అమృతా ప్రణయ్‌ స్పందించినట్లు ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో.. పోస్టర్‌ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ప్రేమించిన పాపానికి భర్తను పోగొట్టుకున్నాను. కన్న తండ్రికి దూరమయ్యాను. నా జీవితం తలకిందులైంది. నా వ్యక్తిత్వం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. నేను ఏంటనేది నాతో ఉన్న వాళ్లకి మాత్రమే తెలుసు. ఇప్పుడు వాటన్నిటినీ భరిస్తూ ఆత్మగౌరవంతో బతుకుతుంటే రామ్‌ గోపాల్‌ వర్మ రూపంలో నాకు మరో సమస్య ఎదురవుతోంది. దీనిని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. ఏడుద్దామనుకున్నా కన్నీళ్లు ఇంకిపోయాయి. ప్రశాంతంగా ఉన్న సమయంలో సినిమా రూపంలో మరోసారి అందరి దృష్టి నాపై పడేలా చేస్తున్నావు. డబ్బు, పేరు కోసం నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని అనుకోలేదు. ఎన్నో బాధలను అనుభవించిన నాకు ఈ బాధ మరీ పెద్దది కాదు’ అంటూ అమృత పేర్కొంది.

ఈ నేపథ్యంలో స్పందించిన వర్మ వరుస ట్వీట్లు చేశారు. “అమృత చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వ్యాఖ్యలపై నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నా. తాను, తన తండ్రి కథతో ‘మర్డర్’ పేరిట నేను సినిమా తీస్తున్నానని తెలుసుకుని ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించారట. అమృతే రాసిందనుకున్నా లేదా ఓ పనిలేని వాడు రాసినా, నేను ‘మర్డర్’లో ఏం చూపించబోతున్నానన్న విషయంలో అనవసరపు ఆందోళనలతో ఉన్న వారి పట్ల స్పందించడం నా విధి అని భావిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. అనంతరం మరో ట్వీట్ చేసిన ఆయన “ఓ జర్నలిస్ట్ వార్త రాసినా, ఓ విచారణ అధికారి విచారించినా, ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేసినా, అది వారివారి ఆలోచనల మేరకు ఉంటుంది. ఓ ఫిల్మ్ మేకర్ గా ‘మర్డర్’ విషయంలో నా ఆలోచన నాది. నా స్వీయ ఆలోచనతో సినిమా తీసే హక్కు నాకుంది. అమృత కామెంట్లే అయినా, మరెవరు రాసినా, నా ఫైనల్ మెసేజ్ ఇదే. ఎంతో బాధను అనుభవించిన వారి పట్ల నాకెంతో గౌరవం, సానుభూతి వున్నాయి. ‘మర్డర్’ ఎవరినీ అగౌరవపరచబోదు” అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu