చిరు సినిమా అప్ డేట్స్!

చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ షూటింగ్
హైదరాబాద్ లో జరుగుతోంది. వినాయక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కోసం హైదరాబాద్
లో భారీ సెట్ వేశారు. ఈ సెట్ లో చిరంజీవి, కాజల్ ఇతర నటీనటులపై ముఖ్య సన్నివేశాలను
చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండి నిర్విరామంగా చిత్రీకరిస్తున్నారు.
ఇప్పటికే చాలా వరకు సినిమా షూటింగ్ పూర్తయింది. సంక్రాంతి కానుకగా ఎట్టి పరిస్థితుల్లో
సినిమా రిలీజ్ చేయాలనే పట్టుదలతో చిత్రబృందం పని చేస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు
తన మ్యూజిక్ ఎసెట్ కావాలనే ఉద్దేశ్యంతో అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరు
రీ ఎంట్రీ ఇస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
మరి ఈ ఖైదీ ప్రేక్షకులను ఎంతవరకు మాయ చేస్తాడో చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates