HomeTelugu Trendingసిగరెట్‌ తాగుతూ దొరికిపోయిన ప్రియాంక.. విమర్శలు గుప్పిస్తున్ననెటిజన్లు

సిగరెట్‌ తాగుతూ దొరికిపోయిన ప్రియాంక.. విమర్శలు గుప్పిస్తున్ననెటిజన్లు

4 20బాలీవుడ్ నుండి హాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన హీరోయిన్‌ ప్రియాంక చోప్రా అప్పుడపుడు టీవీల్లో కనిపిస్తూ ఇక్కడి ప్రేక్షకులకు అడ్వైజెస్ ఇస్తుంటారు. అవి కూడా ఫ్రీగా కాదులెండి డబ్బు కోసమే. గతంలో ఆమె ఒకసారి దీపావళి సందర్బంగా జనాన్ని టపాకాయలు కాల్చవద్దని, ఎందుకంటే తనకు ఆస్తమం ఉందని, పొగ పడదని, తనలాగే చాలామంది ఉంటారని చెప్పుకొచ్చింది.

కానీ కట్ చేస్తే తాజాగా ఆమె భర్త నిక్ జోనస్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో సముద్రపు ఒడ్డున సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కింది. ఇంకేముంది అవి కాస్త వైరల్ అయిపోయాయి. అవి చూసిన నెటిజన్లు ప్రియాంకకు సలహాలు ఇవ్వడం కాదు పాటించాలి అని కొందరు, మీకు టపాకాయల పొగ పడదు కానీ సిగరెట్ పొగ పడుతుందా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!