HomeTelugu Newsనెల్లూరులో సినిమా థియేటర్ల మూసివేత..!

నెల్లూరులో సినిమా థియేటర్ల మూసివేత..!

17
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు తెలుగురాష్ట్రాలను భయపెడుతోంది. ఏపీలో ఇప్పటికే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తిని వైద్యులు ఐసోలేషన్ సెంట్రర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో మహిళకు కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు . దాంతో నెల్లూరులో కరోనా వైరస్ వచ్చిందని తెలిసి అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈనేపథ్యంలో నెల్లూరులోని సినిమా థియేటర్స్ ను మూసివేశారు. గుంపులుగా జనాలు తిరగొద్దని అధికారులు సూచనలు చేశారు. నెల్లూరు లోని చాలా ప్రదేశాల్లో జనాలు గుంపులుగా కనిపించడం లేదు. కాగా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచనలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu