HomeTelugu Trendingసల్మాన్‌ఖాన్‌ను అడ్డుకున్న సీఐఎస్ఎఫ్ ఆఫీస‌ర్‌కు రివార్డు

సల్మాన్‌ఖాన్‌ను అడ్డుకున్న సీఐఎస్ఎఫ్ ఆఫీస‌ర్‌కు రివార్డు

CISF security officer get r

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌ ను.. కొన్ని రోజుల క్రితం ముంబై విమానాశ్ర‌యంలో అక్క‌డ ప‌నిచేస్తున్న సీఐఎస్ఎఫ్ జ‌వాను అడ్డుకున్న విష‌యం తెలిసిందే. టైగ‌ర్‌-3 సినిమా షూటింగ్ కోసం ర‌ష్యా వెళ్లేందుకు విమానాశ్ర‌యానికి వ‌చ్చిన స‌ల్మాన్‌.. కారు దిగి నేరుగా ట‌ర్మిన‌ల్‌లోకి ఎంట‌ర్ అవుతున్న స‌మ‌యంలో అక్క‌డ ఉన్న సీఐఎస్ఎఫ్ సెక్యూర్టీ జ‌వాను అడ్డుకున్నారు. స‌ల్మాన్‌తో పాటు ఆయ‌న‌తో ఉన్న ప‌లువుర్ని డాక్యుమెంట్ చూపించాల‌ని జ‌వాను ఆదేశించారు.

అయితే జ‌వానుకు అడ్డు చెప్ప‌లేక‌పోయిన స‌ల్మాన్‌.. డాక్యుమెంట్లు చూపించాకే లోప‌లికి వెళ్లాడు. ఈ ఘ‌ట‌న‌పై ఇటీవ‌ల ఓ క‌థ‌నం వ‌చ్చింది. స‌ల్మాన్‌ను అడ్డుకున్న జ‌వాను ఫోన్‌ను సీజ్ చేసిన‌ట్లు స్టోరీ రాశారు. దానిపై సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూర్టీ ఫోర్స్ క్లారిటీ ఇచ్చింది. సీఐఎస్ఎఫ్ ఆఫీస‌ర్‌ను మంద‌లించ‌లేద‌ని, కానీ అత‌నికి సరైన రివార్డును ప్ర‌క‌టించినట్లు సీఐఎస్ఎఫ్ తాజాగా త‌న ట్వీట్‌లో పేర్కొన్న‌ది. విధులు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఆ ఆఫీస‌ర్ అద్భుత‌మైన ప్రొఫెష‌న‌లిజం క‌న‌బరిచాడ‌ని, అందుకే ఆయ‌న్ను స‌త్క‌రించిన‌ట్లు సీఐఎస్ఎఫ్ చెప్పింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!