క్లైమాక్స్ లో ‘ఖైదీ నెంబర్ 150’!

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తోన్న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా షూటింగ్ ఆలస్యంగా సెట్స్ పైకి
వచ్చింది కానీ అప్పటినుండి మాత్రం షూటింగ్ చకచకా చేసేస్తున్నారు. ఎక్కడా గ్యాప్ లేకుండా
జాగ్రత్త పడుతూ తొందరగా షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు
సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఇప్పుడు క్లైమాక్స్ పార్ట్ ను షూట్
చేయడం ప్రారంభించారు. ఇందులో చిరంజీవితో పాటు సినిమాలో ప్రధాన పాత్రధారులు పాల్గొనుండగా
క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. క్లైమాక్స్ పార్ట్ తో సినిమా టాకీ పార్ట్
పూర్తవుతుంది. మిగిలిన పాటలను అతి త్వరలోనే చిత్రీకరించి ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి
సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన కాజల్
కథానాయికగా కనిపించనుంది.

CLICK HERE!! For the aha Latest Updates