సమంత అలియాస్ ‘జానకీదేవి’.!

వైవిధ్యభరిత కథాంశంతో తమిళ నాట సంచలన విజయాన్ని నమోదు చేసింది రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ’96’. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సమంత, శర్వానంద్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రనికి ఒరిజినల్ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా ఈ సినిమా టైటిల్‌కి కసరత్తులు ముగియడంతో ‘జానకీదేవి’ అనే టైటిల్‌ని కన్ఫామ్ చేసినట్టు తెలుస్తోంది. తొలిత ‘జాను’, ‘జాను అలియాస్ జానకి’ అనే టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నప్పటికీ జానకీదేవి అనే టైటిల్ మొగ్గు చూపిందట చిత్ర యూనిట్. జానకీదేవి టైటిల్‌ని రిజిష్టర్ చేయడంతో దాదాపు ఈ టైటిల్ ఖాయమైనట్టే. బుధవారం నాడు (మార్చి 6) హీరో శర్వానంద్ బర్త్ డే కావడంతో ఈ మూవీ టైటిల్‌ లోగోని లాంచ్ చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం సమంత ‘మజిలీ’ షూటింగ్‌తో బిజీగా ఉండటంతో వచ్చే నెలలో ‘జానకీదేవి’ మేకప్‌కి రెడీ అవుతుంది.