
Sivarapalli OTT release date:
తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ కొత్త అందమైన వెబ్ సిరీస్ శివరపల్లి రాబోతోంది. రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఫస్ట్‌లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది.
పోస్టర్‌తో పాటు విడుదలైన ట్రైలర్
అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఈ సిరీస్‌ను భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించగా, శన్ముఖ ప్రసాద్ రచన అందించారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ద వైరల్ ఫీవర్ పతాకంపై ఈ సిరీస్‌ను నిర్మించారు.
Eight part Telugu series #Sivarapalli from @TheViralFever premieres on @PrimeVideoIN on January 24
Directed by @BhaskharMaurya
✨ing @smayurk #MuralidharGoud @rupalakshmi23 @udaygurrala @SunnyPalle3 @PavaniKaranam1
— BINGED (@Binged_) January 17, 2025
ఈ సిరీస్‌లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయి. గ్రామీణ భారత దేశం యొక్క విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించే కథనంతో, ఇది ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటుంది. మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, ఉదయ్ గుర్రాల, సన్నీ పల్లే, పావని కరణం వంటి ప్రఖ్యాత నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శివరపల్లి జనవరి 24, 2025 నుండి ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది. తెలుగు భాషలో ఇంగ్లీష్ ఉపశీర్షికలతో ప్రసారం కాబోతోంది. ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని టీజర్ చూస్తే స్పష్టమవుతుంది.
ALSO READ: Richest Actress In The World ఎవరో తెలుసా? ఎన్ని వేల కోట్ల సంపదంటే!