HomeTelugu Trendingసింగర్ చిన్మయిపై కేసు నమోదు!

సింగర్ చిన్మయిపై కేసు నమోదు!

Complaint against singer Ch

సింగర్ చిన్మయి శ్రీపాద తరచూ ఎదో ఒక వివాదంలో ఇరుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్‌ వివాదాస్పదంగా మారాయి. ఇటీవల ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియోను విడుదల చేసింది. అయితే చిన్మయి వ్యాఖ్యలపై ఓ విద్యార్థి ఫిర్యాదు చేశారు. భారత దేశం గురించి తప్పుగా మాట్లాడినందుకుగాను గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నటి అన్నపూర్ణమ్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా? ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని? ఇప్పుడు ఎక్స్‌పోజింగ్‌ ఎక్కువైపోయింది. ఎవరూ మనల్ని ఏమీ అనొద్దని అనుకున్నా.. అందరూ ఏదో ఒకటి అనేట్లుగానే రెడీ అవుతున్నాం. ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనకూడదు. మనవైపు కూడా కొంచెం ఉంటుంది. అని వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణమ్మపై చిన్మయి సోషల్‌ మీడియా వేదికగా ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ఎప్పటికప్పుడు స్పందించే చిన్మయి శ్రీపాద అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్స్‌పై కూడా రియాక్ట్ అయింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇప్పటికీ చాలా ఊర్లలో బాత్రూమ్సే లేవు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్లు ఎప్పుడు వస్తారా? వాళ్లపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడుదామా? అని ఎదురుచూస్తున్నవాళ్లు ఈ సమాజంలో ఉన్నారు. అయినా అమ్మాయిల వేషధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. భారత్‌లో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu