సింగర్‌ చిన్మయిని ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

సింగర్‌ చిన్మయి గతంలో తమిళ రైటర్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలతో మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఇమె మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఎప్పూడు యాక్టివ్‌గా వుండే ఈ సింగర్ తనదైన స్టైల్‌లో మెసేజ్‌లు ఇస్తూనే ఉంటారు. అందులో భాగంగా గతంలో సభ్య సమాజానికి తానిచ్చిన ఫ్రీ మెసేజ్ ఇప్పుడు చిన్మయిని చిక్కుల్లో పడేసింది. ఆమె గతంలో ”వయసు మళ్లిన హీరోలు తమ సినిమాలలో కూతురు వయసుండే హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. ఇది ఇంకా ఆగలేదు.. ఆగిందా..?” అంటూ సోషల్ మీడియా లో ఓ పోస్ట్ పెట్టింది చిన్మయి. ప్రస్తుతం ఆమె ‘మన్మథుడు 2’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో హీరోగా నటించిన నాగార్జున వయసు 59..తన వయసులో సగం కంటే తక్కువ ఉన్న హీరోయిన్లతో నటించాడు . ఇప్పుడు ఈ విషయంపై నెటిజన్స్ ఆమెను టార్గెట్ చేశారు. పబ్లిసిటీ కోసం అప్పట్లో పోస్ట్ లు పెట్టి ఇప్పుడు తన భర్త అలాంటి పనులు చేస్తుంటే ప్రోత్సహిస్తుందని ఆమెని ట్రోల్ చేస్తున్నారు.

ఇలాంటి చీప్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడడం సిగ్గుగా లేదా..? అంటూ ఓ రేంజ్ లో చిన్మయిపై విమర్శలు చేస్తున్నారు. సెలబ్రిటీలు ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే నెటిజన్లు వారిని ఆడుకోవడం ఖాయం. ఇప్పుడు చిన్మయి పరిస్థితి కూడా అలానే మారింది.