HomeTelugu Trendingచిన్మయిని నాశనం చేస్తానంటూ బహిరంగ బెదిరింపులు

చిన్మయిని నాశనం చేస్తానంటూ బహిరంగ బెదిరింపులు

11 11ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కెరీర్‌ను నాశనం చేస్తానంటూ బెదిరించిన ఓ నిర్మాతకు తమిళ దర్శకుడు పా రంజిత్ దీటుగా సమాధానమిచ్చి నోరుమూయించారు. చెన్నైలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి రంజిత్‌, తమిళ నిర్మాత కే రాజన్‌ వెళ్లారు. గతంలో ప్రముఖ గేయ రచయిత వైరముత్తు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, ఎప్పుడైనా ఆయన తన కంటపడితే చెంప చెళ్లుమనిపిస్తానని చిన్మయి అన్నారు. ఈ ఘటన తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. అయితే..
సోమవారం జరిగిన కార్యక్రమంలో తన గురువు వైరముత్తుపై చిన్మయి చీప్‌ పబ్లిసిటీ కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ రాజన్‌ ధ్వజమెత్తారు. ఆమె కెరీర్‌ నాశనం చేస్తానని బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.

ఆ తర్వాత పా రంజిత్‌ స్టేజ్‌పైకి వెళ్లి.. రాజన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నటీమణులు, మహిళా ఆర్టిస్ట్‌ల పట్ల జరుగుతున్న అక్రమాలను ఇప్పటికైనా చిత్ర పరిశ్రమ గుర్తించి నిందితులకు సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కేసులు ఎవరి దృష్టికైనా వస్తే క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని తెలిపారు. అంతేకానీ బయటపెట్టినందుకు వారిని బెదిరించకూడదని రాజన్‌ను పరోక్షంగా హెచ్చరించారు. వైరముత్తు అసలు స్వరూపం చిన్మయి బయటపెట్టినందుకు ఆమెను తమిళనాడు డబ్బింగ్‌ యూనియన్‌ నుంచి తొలగించారు. దాంతో ఆమె కేంద్రమంత్రి మేనకా గాంధీ సాయం కోరారు. ఈ కేసును పరిశీలించి త్వరలో న్యాయం జరిగేలా చూస్తానని మేనక హామీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu